కందకంలో పురాతన విగ్రహాలు

వేలురు: వేలూరులో పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎండల కారణంగా స్థానిక కోట చుట్టూ ఉన్న కందకంలో నీరు కొద్ది రోజులుగా ఇంకిపోతుంది. బుధవారం సాయంత్రం కొందరు పర్యాటకులు కందకా4న్ని వీక్షిస్తుండగా కొన్ని విగ్ర:హాలువారి కంటపడ్డాయి. వారు మరికొందరికి తెలపడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది పురావస్తుశాఖ అధికారుల సమక్షంలో మొత్తం 36విగ్రహాలను బయటకు తీశారు. వాటిలో 2వందల ఏళ్ళనాటి మారియమ్మన్‌, వినాయకుడు, లక్ష్మీ సరస్వతి, లక్ష్మీనరసింహా తదితర విగ్రహాలున్నాయని అధికారులు తెలిపారు. మరియమ్మ విహ్రం మినహా మిగితావన్నీ రాతివే. వాటిని వేలూరు మ్యూజియానికి తరలించారు. జిల్లా కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌ తదితరులు విగ్రహాలను తిలకించారు.