కడప జిల్లాను కూడా చేర్చాలి

కడప, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పర్యాటన దినోత్సవాల్లో కడప జిల్లాలో కూడా నిర్వహించాలని జంబడమడుగు ఎంపిడివో సురేష్‌ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 27 నుంచి అన్ని జిల్లాలో ఈ దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. ఆ జాబితాలో కడప జిల్లాను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దాదాపు నాలుగు దశాబ్దలా తరువాత తిరుపతి తెలుగు మహా సభలు నిర్వహించాలని నిర్ణయించడం కూడా ఆనందకరమన్నారు. అయితే ప్రభుత్వం కడప జిల్లాను కూడా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాల్లో భాగస్వామిని చేయాలని కోరారు.