కమలం నుండి కారు ఎక్కిన కార్యకర్తలు
కమలం నుండి కారు ఎక్కిన కార్యకర్తలు
కొత్తగూడ జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలు గ్రామాల నుండి బిజెపి కార్యకర్తలు రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి,ములుగు గ్రంధాలయ చైర్మన్ గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది.బిజెపి నుండి సిద్దబోయిన నాగేశ్వర్ రావు,మల్లెల లక్ష్మీ నారాయణ,సుద్దగాని ఎల్లయ్య గౌడ్,బూర్క శ్రీరాములు,దనసరి వినయ్ లను బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రెడ్ కో చైర్మన్.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షలు కొమ్మునబోయిన వేణు,అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్ కొత్తగూడ మండల ఉపసర్పంచ్ ల ఫోరం ప్రధాన కార్యదర్శి ఈసం నరేష్ దారం సమయ్య తదితరులు పాల్గొన్నారు