కరీంనగర్‌ డైయిరీని నిర్వీర్యం చెయ్యొద్దు

ఎంపీ ప్రభాకర్‌కు లోక్‌సత్తా, వినియోగమండలి సలహా

కరీంనగర్‌్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : రాష్ట్ర సహ కార చట్టం నుంచి కేంద్ర కంపెనీల చట్టం పరిధి లోకి కరీంనగర్‌ డెయిరీ మారడంపై కొందరు కాంగ్రెస్‌ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ, వినియోగదారుల మం డలి, ఐఐపీఏల ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 50వేల రైతు కుటుంబాలకు ఆసరా గా ఉన్న ఉంటున్న డైయిరీని నిర్వీర్యం చేయ వద్దని కోరారు. ఇటీవల డెయిరీపై కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు డెయి రీని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయా సంస్థల ప్రతినిధులు నరెడ్ల శ్రీనివాస్‌, టి.రాజ మౌళి, కె.చుక్కారెడ్డి, ప్రకాశ్‌హోల్లా, కేఎస్‌ నా రాయణ, కోల రాంచంద్రారెడ్డి, ఓపీ రఘురాం, వి.లక్ష్మణ్‌కుమార్‌, ఎం.గంగాధర్‌, ఆర్‌.చంద్రప్ర భాకర్‌ పేర్కొన్నారు. రైతులకు, రాష్ట్ర అధికారు లకు చెప్పకుండా డైయిరీ కంపెనీగా మార్చారని ఎంపీ ప్రభాకర్‌ చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవ మని వారు ఖండించారు. గత సెప్టెంబర్‌ 29న జరిగిన సర్వసభ్య సమావేశానికి సంబంధించి సెప్టెంబర్‌ 18న పంపిన నోటీసులో ఈ అంశం పేర్కొన్నారని, 239 మంది సభ్యులకుగాను 230 మంది సభ్యులు హాజరైన సర్వసభ్య సమా వేశంలో ఈ తీర్మానం ఆమోదించారని వారు తెలిపారు. ఈ తీర్మానాన్ని అక్టోబర్‌ 21న పం పగా అక్టోబర్‌ 25న ముట్టినట్లు డీసీఓ సంతకా లు ఉన్నాయని, అలాగే సభ్యులకు అందజేసిన వార్షిక నివేదిక పుస్తకంలో ఈ విషయం పేర్కొ న్నారని వారు వివరించారు.

రైతులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డైయిరీ పాలకవర్గం డార్క్‌లో ఉంచి నట్లు ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. డైయిరీపై ఇటీవలి కాలంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకుని రైతుల్లో ఉండే అపొహలను తొలగించేందుకు తాము డైయిరీకి వెళ్లి రికార్డులు పరిశీలించామని వారు తెలిపారు. నిజాం కాలంలో డైయిరీ అధికారులు ఐదు వందల ఎకరాల్ని రెండు లక్షల రూపా యలకు కొన్నారని, అందులో రాష్ట్ర ప్రభుత్వం శాతవాహన విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్‌ తది తర సంస్థలకు కేటాయించగా డైయిరీ అధీనంలో కేవలం ఇరవై ఎకరాలు మాత్రమే ఉందని, అది పూర్తిగా రైతుల ప్రయోజనాలకే వినియోగిస్తు న్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కోసం ఇదే స్థలంలో ఎకరం కేటాయిస్తే వారు కల్యాణ మండపం నిర్మించి వ్యాపారం చేస్తున్న విషయా న్ని కాంగ్రెస్‌ నేతలు గుర్తించాలన్నారు. ప్రస్తుతం పాలకవర్గం స్వాధీనం చేసుకున్నప్పుడు భవనా లు, యంత్రాల ఆస్తుల విలువ కేవలం 11 లక్షల యితే ప్రస్తుతం అది 13 కోట్లకు పెరగడం వెను క రైతుల శ్రమ దాగి ఉందన్నారు. తెలంగాణలో కరీంనగర్‌ డైయిరీ అగ్రస్థానంలో ఉందని, మెద క్‌లో రోజు పాలసేకరణ 24వేల లీటర్లు, వరం గల్‌లో 23 వేలు, నిజామాబాద్‌లో 20వేలు కాగా, కరీంనగర్‌లో లక్షా ఎనిమిది వేల లీటర్ల పాలసేకరణ జరుగుతోందనే విషయాన్ని కాం గ్రెస్‌ నాయకులు గుర్తించాలని వారు కోరారు.