కరీంనగర్‌ ప్రజలకు తాగునీరందించాలి:పోన్నం

కరీంనగర్‌:జిల్లా ప్రజలకు తాగు నీరందించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు.జిల్లా ప్రజలకు నీళ్లివ్వకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్లితే ఉరుకునేదిలేదని హెచ్చరించారు.ఈరోజు ఆయన ఇక్కడ రాష్ట్రస్థాయి మాసికవైద్య నిపుణుల రెండ్రోజుల సదస్సును ప్రారంబించారు.విలేకరులతో మాట్లాడారు.తాగునీటి కోసం తల్లడిల్లుతున్న జిల్లా ప్రజలకు సత్వరమే నీటిని సరఫరా చేయాలని అన్నారు.లేకుంటే రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.పనిచేయని ఐఏఎస్‌ అధికారులను రోడ్డుపై నిలబెట్టి కాల్చిచంపాలని మంత్రి టీజీ వెంకట్‌శ్‌ చేసిన వ్యాఖ్యలను పొన్నం తీవ్రంగా ఖండించారు.