కరుణానిధి ప్రకటన ఒక నాటకం

చెన్నై : యూపీఏ నుంచి వైదొలగుతానని కరుణానిధి ప్రకటించడం నాటకమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. కరుణానిధి ప్రతిపాదనలను పార్లమెంటులో ఆమోదించడం వల్ల ప్రయోజనం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.శ్రీలంక తమిళుల ప్రయోజనాలు ఐరాస తీర్మానాల ద్వారానే పరిరక్షించబడాలని జయలలిత అన్నారు.