కరెంటు షాకుతో ఇద్దరు రైతుల మృతి

జగ్గయ్యపేట:  జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామంలో వ్యవసాయ పనులకు  వెళ్లిన ఇద్దరు రైతులకు కరెంటు షాకు కొట్టి అక్కడికక్కడే మృతిచెందారు. కొండ, గురవయ్య అనే రైతులు పొలం వెళ్తుండగా తెగిపడిన విద్యుత్తు వైరు పొలానికి వేసిన కంచెకు తగిలి ఉంది. అది గమనించని రైతులు కంచె పట్టుకోగా షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.