కరెంట్‌ ఛార్జీల పెంపుపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ

హైదరాబాద్‌: కరెంట్‌ ఛార్జీల పెంపుపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ ప్రారంభమైంది. టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉపనేత హరీష్‌రావు, రాఘవులు, నారాయణ, దత్తాత్రేయలు దీనికి హాజరయ్యారు. సర్‌ ఛార్జీలు ఉపసంహరించాలని టీఆర్‌ఎస్‌, వామపక్షాలు  డిమాండ్‌ చేశాయి. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ సర్‌ఛార్జ్‌ల పెంపుపై త్వరలో టీఆర్‌ఎస్‌ ప్రత్యక్ష పోరాటం చేస్తుందని తెలియజేశారు. గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులకు గ్యాస్‌ను అక్రమంగా కేటాయించడంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పేద ప్రజల పైసలను ల్యాంకో, జీఎంఆర్‌ సంస్థలకు ప్రభుత్వం దోచి పెడుతుందని హరిష్‌రావు ఆరోపించారు.