కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తం

మహబూబ్‌నగర్‌: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిపై నిర్మించిన అనకట్టలు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో మన రాష్ట్రంలోకి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. మరో రెండు గంటలో ఈ వరద నీరు జూరాల ప్రాజెక్టుకు చేరనుంది. వరద నీటిని నియంత్రించేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు.