కర్నూలులో రోడ్డు ప్రమాదం
కర్నూలు : ఉయ్యలవాడ మండలం బోడెమ్మనూరు మెట్ట వద్ద ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. క్షతగ్రాతులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.