కలం కవాతుకు పోలీసుల అనుమతి

హైదరాబాద్‌: ఈనెల 30న జరిగే తెలంగాణ జర్నలిస్టుల కలం కవాతుకు పోలీసుల అనుమతి లభించింది. గన్‌పార్క్‌ నుంచి కాకుండా సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ర్యాలీ నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలియజేశారు. ర్యాలీ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలిపింది. జర్నలిస్టులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చింది.