కలెక్టరెట్ ఎదుట దివ్యాంగుల ఆందోళన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 5.(జనంసాక్షి). దివ్యాంగులకు సకాలంలో పెన్షన్ ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ఎదుట దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగ సమితి నాయకులు నిరసన తెలిపిన అనంతరం మాట్లాడుతూ దివ్యాంగులకు సకాలంలో పెన్షన్లు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల కు స్వయం ఉపాధి కోసం రుణాల తో పాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో మాదాసు రాజేష్, మామిడాల నరేష్, రాము ,శ్రీరాములు పరుశురాములు, ప్రసాద్ ,శ్రీధర్, పలురు దివ్యాంగులు పాల్గొన్నారు.