కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఆసరా- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

రామన్నపేట మార్చి 24 (జనంసాక్షి) మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  అన్నారు. శుక్రవారం  ఎంపీడీఓ కార్యాలయంలో మండలానికి చెందిన 45 మందికి రూ.45 లక్షల కళ్యాణ లక్ష్మీ  చెక్కులను, ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు  పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. .పేదల సంక్షేమం కోసం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని…దీనిలో  భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు  పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు.
*సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణి*
రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు రూ. 12 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం జడ్పిటిసి పున్న లక్ష్మీ జగన్మోహన్ సింగల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ వైస్ ఎంపీపీ నాగిటి ఉపేందర్ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి టిఆర్ఎస్ మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం సర్పంచులు గుత్త నర్సిరెడ్డి, ఎడ్ల మహేందర్ రెడ్డి, అప్పం లక్ష్మీ నర్సు ధర్మే రాణి, కాటేపల్లి సిద్ధమ్మ, ముత్యాల సుజాత, కాలియా యామిని, ఉప్పు ప్రకాష్, యాదాసు కవిత, కడమంచి సంధ్య, మెట్టు మహేందర్ రెడ్డి, బొక్క యాదిరెడ్డి, రేఖ యాదయ్య, పిట్ట కృష్ణారెడ్డి ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్ రెడ్డి, గొరిగె నరసింహ, దోమల సతీష్, గాదె పారిజాత, బడుగు రమేష్, ఎండి అమీర్ నాయకులు బందెల రాములు, బద్దుల రమేష్, పున్న వెంకటేష్, బత్తుల వెంకన్న, ఎండి ఇనాయత్, జడ సంతోష్, బొడ్డు అల్లయ్య, బడుగు రఘు, లవణం రాధిక, సల్ల సత్య ప్రకాష్, బత్తిని మహేష్, ఆవుల నరేందర్, ముక్కామల నరేందర్, ఆవుల శ్రీధర్, ఎండి అస్లాంబిక్, జాల అమరేందర్ రెడ్డి, చెరుకు ఉపేందర్, మామిళ్ల అశోక్, గర్దాస్ విక్రమ్, గుండు రమేష్, బండ శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల సురేందర్ రెడ్డి, బొలుగుల కృష్ణ, బొడ్డు శ్రీకాంత్,  హరీష్, యాదయ్య, మొగులయ్య, వినయ్, స్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.