కష్టాల్లో రాష్ట్ర ప్రజలు: ఎర్రన్నాయుడు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని వర్గాల  ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెదేపా నేత ఎర్రన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలోనే ప్రభుత్వ భూమిల్ని పరిరక్షించామన్నారు. తమ పార్టీ ప్రకృతి వనరుల్ని ప్రజావసరాలకే వినియోగించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికబడ్జెట్‌తో అవినీతికి తెగబడిందని విమర్శించారు. వైఎస్‌ హయాంలో 13,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక లెక్కలున్నాయని ఆయన తెలియజేశారు.