కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది

పోరుబాట పడితేనే తెలంగాణ : కేకే
హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాటతప్పుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కే కేశవరావు అన్నారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్‌ 9 నుంచి తడవుకో వాయిదా పెట్టడం, దాటవేసే ధోరణి అవలంబించడం వల్ల తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించడమే ఏకైక కర్తవ్యంగా ఉందన్నారు. అధిష్టానం పూర్వవైభవం కోసం డిసెంబర్‌ 9 ప్రకటనపై కట్టుబడి ఉండకపోతే రెండు ప్రాంతాల్లో తుడుచు పెట్టుకుపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.