కాంగ్రెస్‌ అధిష్టానికి చిత్తశుద్ది లేదు : నారాయణ

ఆదిలాబాద్‌: వామపక్ష నేతలకు జైళ్లు కొత్త కాదని, తెలంగాణ కోసం 20ఏళ్లు జైల్లో ఉండటానికి తాము సిద్దమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానికి చిత్తశుద్ది లేదని, తెలంగాణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు పనికిరావని పేర్కోన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పోరు యాత్రలో నారాయణ పాల్గొని ప్రసంగించారు.