కాంగ్రెస్‌, టీడీపీ డ్రామాలకు స్వస్తి చెబుదాం

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలుగుదేశం,  కాంగ్రెస్‌ పార్టీలు  ఆడే డ్రామాలకు స్వస్తి చెప్పి ప్రజా ఉద్యమంలోకి కలిసి రావాలని ఐకాస నేతలు  పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో భాగంగా  ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 906వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస నేతలు మాట్లాడుతూ, దశాబ్ధాలుగా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని  వారు డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతంలోని టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు తమ పార్టీలను వీడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొకపోతే ప్రజలు క్షమించరని  హెచ్చరించారు.