కాంగ్రెస్‌, వైకాపాలు అవినీతి పార్టీలు షర్మిల పాదయాత్రకు ప్రభుత్వ లాంఛనాలు

ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు విజయమ్మకు లేదు

టీడీపీ సీనియర్‌ నేత గాలి మద్దుకృష్ణమనాయుడు

తిరుపతి, నవంబర్‌22: రాష్ట్రంలో పరస్పర విమర్శల పరంపర కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. పాదయత్రల జోరే కాదు..విమర్శల జోరు కూడా కొనసాగుతోంది. కాంగ్రెస్‌, జగన్‌ పార్టీలు రెండూ అవినీతి పార్టీలేనని టీడీపీ సీనియర్‌ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన నందమూరి తారక రామారావు గురించి మాట్లాడే అర్హత వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు లేదని మండిపడ్డారు.  చంద్రబాబు పాదయాత్రపై విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై తిరుపతిలో గాలి, బొజ్జల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. షర్మిల పాదయాత్ర ప్రభుత్వ లాంఛనాలతోనే కొనసాగుతోందని ఆరోపించారు. అవినీతి సొమ్మును కాంగ్రెస్‌, వైకాలు పంచుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని దుయ్యబట్టారు. వైఎస్‌ ఎవినీతి సొమ్ములో భాగస్వాములైన విజయమ్మ, షర్మిల, భారతి, బ్రదర్‌ అనిల్‌కుమార్‌ను అరెస్టు చేసి జైళ్లో పెట్టాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. విశ్వాసం గురించి మాట్లాడే హక్కు వైకాపాకు లేదని విమర్శించారు. రాజకీయ వ్యభిచారం చూస్తూ ప్రతి ఎమ్మెల్యే ఇంటి తలుపును తట్టి లోబరుచుకుంటున్న వైకాపా ఎందుకు ప్రభత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని ప్రశ్నంచారు. చాతకాకనే టీడీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.