కాంచన` 3 రష్యన్‌ నటి ఆత్మహత్య


రాఘవ లారెన్స్‌ నటించిన కాంచన 3లో దెయ్యం పాత్రలో కనిపించి సందడి చేసిన నటి రష్యన్‌ యువతి అలెగ్జాండ్రా జావి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో అద్భుతంగా నటించిన అలెగ్జాండ్రా తన అª`దదె ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. గోవాలో ఆమె బస చేసిన హోటల్‌ లోనే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితం తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లుగా తెలుస్తోంది. దాంతో డిప్రెషన్‌ లోకి వెళ్లిన ఆమె సూసైడ్‌ చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే అవకాశం ఉందని, ఆ కోణంలో కూడా విచారణ చేపడతామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. 2019లో ఈ అమ్మడు చెన్నై ఫొటోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులు చేస్తున్నాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతని వల్ల ఏమైన చనిపోయిందా అనే కోణంలోను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అలెగ్జాండ్రా జావి మరణవార్తను వారి బంధువులకు చేరవేశారు. ఇతర ఫార్మాలిటీలను రష్యన్‌ కాన్సులేట్‌ పరిశీలిస్తుంది. అయితే 24 ఏళ్ల వయస్సులో ఆమె మృతి చెందడం అందరిని కలవరపరుస్తుంది.