కాకతీయ కెనాల్‌లో స్కూల్ బస్సు బోల్తా
కరీంనగర్: జిల్లా కేంద్రానికి సమీపంలోని అలగనూరు చౌరస్తా దగ్గర కాకతీయ కెనాల్‌లో స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా ఆరుగురు విద్యార్థలకు తీవ్రగాయాలయ్యాయి.క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.