కాజీపేట-విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్‌: డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో ఓ భారీ వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో స్టేషన్‌లోని విద్యుత్‌ తీగలు తెగిపడటంతో కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అహ్మదాబాద్‌-చెన్నై నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగులో కాజీపేట-విజయవాడ ప్యాసింజర్‌ రైళ్లను అధికారులు నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది మరమ్మత్తు పనులు చేపట్టారు.