కానిస్టేబుల్ ఆత్మహత్య
రాజమండ్రి: ఎస్సై వేధింపులకు తాళలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జడ్డంగి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ శనివారం అర్థరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మెమో ఇచ్చాడని మనస్థాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.