కారు ఢీకొని బాలుడు మృతి

కోండపాక. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి రాజీవ్‌ రహదారిపై పరిపాటి మైష్ణవరెడ్డి(8)ని కారు డీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ బాలుడు చిన్నకోడూరు మండలన అల్లిపూర్‌ గ్రామానికి చెందిన దుర్గారెడ్డి కుమారుడు వైష్ణవరెడ్డి అమ్మమ్మ ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు. బస్టాపు వద్ద ఉన్న ఒక హోటల్‌లో టీ తాగి వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. కుకునూరుపల్లి ఎస్సై బాల్‌రెడ్డి అద్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.