కారు, సైకిల్‌ ఢీ : ఒకరు మృతి

ఆర్మూర్‌ జూన్‌ 16 (జనంసాక్షి) : ఆర్మూర్‌ పట్టణ శివారు ప్రాంతమైన దోభిఘట్‌ వద్ద శనివారం సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్‌ నుండి అర్మూర్‌వైపు వస్తున్న  ఎపి 9 బియు 3656 సంత్రో కారు సైకిలిస్ట్‌ను ఢీకోనడంతో అర్మూర్‌ కుమ్మర్‌ గల్లికి చెందిన సైకిలిస్ట్‌ కముల్‌ మనో హర్‌(38) మృతిచెందడం జరిగింది. కారు నడిపి ప్రమాదానికి గురైన తర్వాత కారులో ఉన్న వ్య క్తులు మరికాస్త ముందటికి వెళ్లి నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకోని భయంతో పారిపోవడం జరి గింది,  మనోహర్‌ మృతిచెందడంతో కుటుంబస భ్యులు శోకసముద్రంలో మనిగారు. ప్రమాద నికి కారణమైన కారును పోలిసులు పంచనామ నిర్వ హించి శవాన్ని అర్మూర్‌ ప్రభుత్వ అస్పత్రి మార్చు రికి తరలించడం జరిగింది. కారును స్వాధీన పరుచుకోని పోలిసుస్టేష్‌నుకు తరలించారు.