కార్గిల్‌ అమరవీరులకు నివాళులు

హైదరాబాద్‌: కార్గిల్‌ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘల ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సైనికుల కుటుంబసభ్యులంతా పాల్గొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మలకు  శాంతి కలగాలని ప్రార్థించారు. సైనికుల కుటుంబసభ్యులను సన్మానించారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.