కార్మిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది : హెచ్‌ఎంఎస్‌

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి):

కార్మి హక్కులకు సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇం జినీర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) రక్ష ణ కల్పిస్తుందని ఆ సంఘ నాయకులు అన్నా రు. మంగళవారం ఓసిపి-3 సిహెచ్‌పి కేపిల ్‌ఫేజ్‌లో హెచ్‌ఎంఎస్‌ గేట్‌మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లా డుతూ… కార్మిక హక్కుల రక్షణ కోసం హెచ్‌ ఎంఎస్‌ అలుపెరగని పోరాటాలు చేస్తుందని, ఏఐటియుసి, టిబిజికేఎస్‌, ఐఎన్‌టియుసిలు యాజ మాన్యానికి తొత్తులుగా వ్యహహరిస్తు… కార్మిక హక్కులను కాలరాయడానికి ప్రయత్నిస్తుందన్నారు. హెచ్‌ఎంఎస్‌ ప్రజాస్వామ్య విధానాలను, కార్మిక చట్టాలను మార్గదర్శకాలుగా తీసుకుని ఐక్యపోరాటాలు చేసి… కార్మికులకు న్యాయం చేయడానికి సిద్దంగా ఉందన్నారు. ఈ గేట్‌మీటింగ్‌లో నాయకులు సిహెచ్‌.నారాయణరెడ్డి, ఆర్‌.కేశవరెడ్డి, వి.ప్రతాపరావు, దేవ వెంకటేశం, ఎంఎ.జమీల్‌, మేర్గు రాజయ్య, ఎరుకల రాయమల్లు, ధనుంజయ్‌, ఆమంచ గౌతం, లింగారెడ్డి, నాగన్న, హజిజుల్లా, కనకయ్య, సుద ర్శన్‌, మల్లేష్‌, రామస్వామి, వెంకటి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.