కాలం చెల్లిన 34 బస్సుల నిలిపివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31: నిజామాబాద్‌ ఆర్టీసి రీజియన్‌ పరిధిలో కాలంచెల్లిన 34 బస్సులను నిలివివేస్తున్నట్టు ముఖ్య ఛీప్‌ ఇంజనీర్‌ యం.వెంకటేశ్వర్‌ తెలిపారు. బోధన్‌ ఆర్టీసి డిపోను తనీఖి సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసిలో 11లక్షల 50వేల కిలోమీటర్లు తిరిగిన బస్సుల కండీషన్‌ను సమీక్షించి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.బోధన్‌ ఆర్టీసి డిపోలో స్థలభావంతో పదిహేను బస్సులు పంపించడానికి అనుమతి లభించిందని చెప్పారు. బస్సుల నిర్వహణ ఖర్చు నాలుగు పద్దులో జరుగుతుందన్నారు. ప్రతి డిపోను రెండు నెలలకోసారి తనిఖీచేసి ప్రయణికుల సౌకార్యర్థం సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని సవరించాలని లక్ష్యం నిర్దేశిస్తామని అన్నారు.ఆయన వెంట బోధన్‌ డిపో మేనేజర్‌ సత్యనారాయణ, మల్లేషం తదితరులు ఉన్నారు.