కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ప్రకాశం : ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఆగ్రహారం వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌ విఫలం కావడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.