కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: ముఖ్యమంత్రి
హైదరాబాద్: కాలుష్య నియంత్రణ మండలిపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాలుష్యం భారీగా వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు పురపాలక శాఖా మంత్రి మహీధర్‌రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు.జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.



