కాల్‌డేటా వ్యవహారంలో కేవీ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ

హైదరాబాద్‌: సీబీఐ జేడీ కాల్‌డేటా వ్యవహారంలో అరెస్టైయిన ఇంద్‌ భారత్‌ ప్రతినిధి కూవి రెడ్డిని సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మహారాష్ట్రాలోని నాందేడ్‌ పోలీసులను తప్పుదారి పట్టించి కేవీ రెడ్డి ఈ కాల్‌డేటాను తీసుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ మెరకు పోలీసులు ఆయనను కేసులో నిందితుడిగా చేర్చారు.