కాల్ లిస్టు వ్యవహారంపై విచారణ 13 కు వాయిదా
హైదరాబాద్, జూలై 10 : సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్ కాల్స్ డాటా లీకేజ్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ పై దాఖలు చేసిన పిటీషన్‌ను వాపసు తీసుకున్నామని, ఈ విషయం ఆయనతో కూడా చర్చించామని రఘురామకృష్ణంరాజు తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో దోషిగా తన పేరును కొన్ని పత్రికలు ప్రచురించటంపై పరువునష్టం దావా కూడా వేశామని స్పష్టం చేశారు. గతంలో తన క్లయింట్ సిబిఐ జేడి ఎవరెవరితో మాట్లాడారన్న కాల్ డాటాను మాత్రమే తీసుకున్నారని, సంభాషణ రికార్డులను కాదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సర్వీసు ప్రొవైడరు నుంచి ఎవరైనా కాల్ డాటాను తీసుకోవచ్చని ఇందులో ఎలాంటి కుట్రా లేదని హైకోర్టుకు విన్నవించారు. దర్యాప్తు అధికారుల కాల్ జబాతాలను ఎవరైనా తీసుకోవచ్చా డలపప డాటాకు సంబంధించి చట్టంలోఎలంఆటి నిబంధనలు ఉన్నాయని హైకోర్టు సిబిఐ న్యాయవాదులను ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటీషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దీనిపై హోం శాఖ తరఫున రాష్ట్ర అడ్డకేట్ జనరల్ కూడా ఆరోజు వాదనలు వినిపించనున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై సిబిఐ కూడా ఓ నివేదికను కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది.