కాశ్మీర్‌ సమస్యను రాజేయడమే పాక్‌ లక్ష్యం

కాశ్మీర్‌ అభివృద్దికి వేలకోట్ల రూపాయను కేటాయించినా, అక్కడ యువత పాక్‌ ఉగ్రవాద ఉచ్చులో ఇరుక్కుంటూ భవిష్యత్‌ను సర్వనాశనం చేసుకుంటోంది. తొలిదశలో స్వాతంత్య్రా నంతరం నెహ్రూ అవలంబించిన విధానాల కారణంగా అక్కడ ఉగ్రమూకలు తిష్టవేసి హిందువులను ఊచకోత కోశాయి. లక్షలాది కుటుంబాలను తన్ని తరిమేశాయి. అక్కడే ఉండాలనుకున్న వారిని బలవంతంగా మతం మార్చారు. కాశ్మీర్‌ పండిట్లను ఊచకోతకోసి,మతం మార్చి నానాహింసలు పెట్టిన సంగతిని మరచిపోలేం. ఇన్ని ఘోరాలు జరిగినా ఏనాడు పట్టించుకోని ప్రభుత్వాలు రాజ్యం ఏలాయి. పాక్‌ ప్రబుత్వాలు కూడా ఏనాడు శాంతికి ముందుకు రాలేదు. అంతేగాక కాష్టాన్ని ఎగదోస్తూనే ఉన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం, నిరక్షరాస్యతపై కలిసి పోరాడుదామంటూ ఇమ్రాన్‌కు పిలుపునిచ్చారు. దీనికి ఇమ్రాన్‌ స్పందిస్తూ.. తాను పఠాన్‌ వంశస్థుడినని, ఇచ్చిన మాట తప్పమని బదులిచ్చారు. ఆ సందేశాన్ని ఇప్పుడు ఉటంకిస్తూ పఠాన్‌ బిడ్డవైతే చర్యలు తీసుకోవాలంటూ మోదీ సవాల్‌ విసిరారు. ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.  సరైన ఆధారాలు చూపితే పుల్వామా దాడికి పాల్పడిన వారిపై  వెంటనే చర్యలు తీసుకుంటామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి అన్నారు. ‘విూరు నిజంగా పఠాన్‌ బిడ్డైతే వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని భారత ప్రధాని మోదీ విసిరిన సవాల్‌కు ఇమ్రాన్‌ఖాన్‌ స్పందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని.. భారత్‌ ఆధారాలు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పాక్‌ ప్రధాని కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. శాంతికి ఓ అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్‌ అందులో కోరారు. పుల్వామా దాడి వెనక పాకిస్థాన్‌ హస్తం ఉందన్న భారత్‌ వాదనను ఇమ్రాన్‌ఖాన్‌ గతంలో తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఆధారాలుంటే చూపాలని సవాల్‌ విసిరారు. భారత్‌ యుద్దానికి దిగితే తిప్పికొట్టడానికి పాక్‌ సిద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఆదివారం పాక్‌ విదేశాంగ మంత్రి మొహ్మద్‌ ఖురేషీ మాట్లాడుతూ.. పాక్‌ శాంతిని కోరుకుంటుందని తెలిపారు. కానీ భారత్‌ మాత్రం యుద్ధ వాతావరణాన్ని సృష్టింస్తుందంటూ ఆరోపించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐరాసను కలగజేసుకోవాలని కోరినట్లు ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా మాజీ నియంత పర్వేజ్‌ ముషానఫ్‌ కూడా శాంతి వచనాలుపలుకతుఊ ముందుగా మనమే బాంబులు వేస్తే భారత్‌ కెఓలుకోదని అంటున్నారు. ఎంతగా వారు విషపూర్తితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో కాశ్మీర్‌లో సంకీర్ణ సర్కార్‌ ద్వారా శాంతిని నెలకొల్పాలని బిజెపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఓ రకంగా మెహబూబా ముఫ్తీ తూట్లు పొడిచారనే చెప్పాలి. సైనిక చర్యను అడ్డుకుంటూ ఆమె సైన్యంపైనే కేసులు పెట్టించారు. ఇదో రకంగా ఉగ్రవాదులకు ఊతంగా మారింది. అక్కడ ఉగ్రవాదులను ఏరివేయాలన్న సంకల్పాన్ని దెబ్బతీసారు. ఇటీవల ఓ పత్రికా సంపాదకుడిని, సైనికుడిని హత్య చేయడం చూస్తే ప్రభుత్వం నిర్తిప్తంగా ఉందనే గమనించాలి. పాక్‌ అనుకూలతను జీర్ణించుకున్న మెహబూబా ముఫ్తీ పరోక్షంగా ఉగ్రవాదుల చర్యలు సమర్థిస్తూ వచ్చారు. అక్కడ వారి ఏరివేతను కర్రపెత్తనంగా చెప్పుకొచ్చారు. మొత్తంగా వ్యవహారం చేయిదాటడంతో చేసేది లేక బిజెపి ప్రభుత్వం నుంచి బయటపడడం, గవర్నర్‌ పాలన విధించడం అనివార్యంగా మారాయి. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కశ్మీర్‌ విధానంపై విమర్శలు చేస్తున్న గులాం నబీ ఆజాద్‌, లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఇంతకాలం రావణకాష్టం రగిల్చిన విషయాన్ని మర్చి పోరాదు. కశ్మీర్‌ సమస్య ఈనాటిది కాదని, ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేసుకోవాల్సిన అవసరం
ఉంది. కశ్మీర్‌లోయలో శాంతి, అభివృద్ధికి భాజపా చేసినంతగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదు.   పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం అక్కడ అశాంతిని రాజేస్తోంది. రంజాన్‌ సందర్భంగా సైన్యం  కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంటే దానిని కూడా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చు కున్నారు. పాకిస్థాన్‌ నుంచి చొరబడే ఉగ్రవాదులను మట్టుబెట్టకుండా భద్రతా బలగాలను ఎప్పుడూ విశ్రమించలేదు. తీవ్రవాద నిరోదంపై పాకిస్థాన్‌ సుముఖంగా ఉంటే ఆ దేశంతోనూ మాట్లాడతామని భారత్‌ పదేపదే చెబుతూనే ఉంది. అయితే తొలుత ఆ దేశం తన గడ్డపై నుంచి వస్తున్న ఉగ్రవాద సమస్యను పరిష్కరించాలని కేంద్ర¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కాశ్మీర్‌ భారత దేశానికి మణి మకుటం లాంటిది.  అలాంటి రాష్ట్రం తీవ్రవాద  సమస్యల్లో చిక్కుకోవడం దేశానికి ఎప్పటికీ మంచిది కాదు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కావాలనే తీవ్రావాద శక్తుల విజృంభించి కాశ్మీర్‌లోయను రక్తమోడేలా నిరంతరం శ్రమిస్తూ వచ్చాయి. రంజాన్‌ సందర్భంగా కాల్పుల విరమణ గురించి కేందప్రభుత్వం ప్రకటించ గానే పరిస్థితి మెరుగుపడుతుందని, తుపాకుల మోత ఆగిపోతుందని ఆశించిన కాశ్మీరీయులకు నిరాశే మిగిలింది. కానీ ఉగ్రవాద ప్రేరేపిత మత చాందసులు మరింతగా సమస్యను ఎగదోశారు. కాశ్మీర్‌ అగ్నిగుండంగా మారేలా చేశారు. మతం పేరుతో అక్కడ హింసను రాజేస్తున్నారు. పాక్‌ గడ్డవిూది నుంచి ఉగ్రవాదులను తయారు చేసి ఎగదోయడమే కారణమని వేరుగా చెప్పక్కరలేదు.  కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలతో శాంతికి అవకాశం ఏర్పడినప్పుడల్లా పాక్‌ రంగప్రవేశం చేస్తోంది. మోడీ ప్రభుత్వం అనుసరించిన ఉగ్రవాద ఏరివేత విధానాల మూలంగా సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాలను
లక్ష్యంగా చేసుకున్న పాక్‌ నేరుగా  పౌరులు, భద్రతా జవాన్లపై కాల్పులు జరుపుతూ వస్తోంది. దీంతో మనవైపు నుంచి ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. కాశ్మీర్‌లో నిరసనలు, వేర్పాటువాదుల డిమాండ్లు పాక్‌ ప్రేరేపితమైనవేనని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. రెండు వైపులా ఉన్న వేర్పాటువాద, మత ఛాందసవాద సంస్థలు ఘర్షణలను రెచ్చగొట్టి కాశ్మీర్‌ను రావణ కాష్టంలా మార్చుతున్నాయి.

తాజావార్తలు