బీసీల రాజ్యాధికారమే టీఆర్పీ లక్ష్యం

 

 

 

 

 

 

సూర్యాపేట (జనంసాక్షి): సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు బీ ఫామ్ లను పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ సోమవారం అందజేసి మాట్లాడారు. అభ్యర్థులు వారి వారి వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు.ఎన్నికల ప్రచారంలో పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.అనంతరం వట్టే జానయ్య యాదవ్ తో కలిసి అభ్యర్థులందరు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయం నుంచి సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి బీ-ఫారమ్‌లను అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రెండన్నర కోట్ల జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పార్టీగా ఏర్పడిందని తెలిపారు.సమ న్యాయం, పేద ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అగ్రకులాల పార్టీల బీ ఫారమ్‌ల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులు ఎదురుచూపులు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ వారికి రాజకీయంగా న్యాయం జరగలేదని విమర్శించారు. ఈ సారి ప్రజల స్వంత పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు ఇచ్చి రాజకీయ మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, పెన్పహాడ్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య, యగ్గడి మురళీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.