అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి మృతి

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామ్ రెడ్డి (79) మంగళవారం ఉదయం ఏడు గంటలకు అనారోగ్య కారణాల వల్ల హైదరాబాదులో మృతి చెందారు.
ఆయన స్వగ్రామం మంథని నియోజక వర్గం పరిధిలోని ముత్తారం మండలం ఖమ్మంపల్లి. ఆఆయ ఖమ్మంపల్లి సర్పంచ్, ముత్తారం ఎంపీపీగా పదవులు నిర్వహించారు. 1994లో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదెండ్లు ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వహించి, ప్రజల మనిషిగా.. రైతు పక్షపాతిగా రైతు నాయకుడిగా పేరొందారు. ఆయన మృతి మంథని నియోజక వర్గ ప్రజలకు తీరని లోటు గా చెప్పక తప్పదు. మంచితనానికి మానవత్వానికి మారుపేరుగా నిలిచిన రామ్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం పట్ల మంథని నియోజకవర్గంలోని పలు పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు దుఃఖంతో కూడిన హృదయాలతో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.


