ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులుగా పుట్టపాక తిరుపతి.

 

 

 

 

 

 

 

దండేపల్లి, ఫిబ్రవరి3( జనం సాక్షి): మంచిర్యాల జిల్లా ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులుగా దండేపల్లి మండల తాళ్లపేట ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతిని నియమించినట్లు రాష్ట్ర ఉపసర్పంచుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పుల మహేష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపసర్పంచ్ ల బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఉపసర్పంచ్ ల సమస్యల పై అధికారులతో చర్చిస్తామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు జితేందర్ రావు, జిల్లా గౌరవ అధ్యక్షులు బోయిని తిరుపతి ఉపసర్పంచ్ లు మాలవత్ రాజు, కాండ్రపు శ్రీలత-లక్ష్మణ్, మర్సుకోల్ల ప్రభాకర్, పూదరి రమణయ్య, ఒడ్డేటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.