కిన్నెరసాని జలాశయం గేట్లు ఎత్తనున్న అధికారులు

ఖమ్మం: కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం 403అడుగులకు చేరింది. దాంతో సోమవారం రాత్రి పదిగంటలకు అధికారులు 4గేట్లను ఎత్తివేయడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కిన్నెరసాని జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.