కుక్కను కాపాడబోయి ముగ్గురి మృతి

శాన్‌ఫ్రాన్సిస్కో : హోవార్డ్‌ కుల్జియన్‌ కుటుంబం ఓ సాయంత్రం సరదాగా బీచ్‌కి షికారుకెళ్లిన సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పెను అనుతాకిడికి కొట్టుకుపోతున్న తమ పెంపుడు కుక్కను రక్షించబోయి కుల్జియన్‌ దంపతులు, వారి కుమారుడు గ్రెగోరి… ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె ఆమె స్నేహితులు మాత్రం ఈ హఠాత్పరిణామాన్ని నిర్ఘాంతపోయి చూస్తూ ఒడ్డున నిలుచోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. యజమాని విసిరిన కర్ర సముద్రం ఒడ్డున నీటి దగ్గర పడింది. అది తేవడానికి వెళ్లిన పెంపుడు కుక్క ఫ్రాన్‌ని పెను అల ఒకటి వచ్చి కబళించింది. దాంతో హోవార్డ్‌ కుమారుడు గ్రెగోరి కుక్కను కాపాడదామని పరుగుతీశాడు. అతని వెనకే తల్లిదండ్రులూ వెళ్లి ముగ్గురూ అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రాణాలు వదిలారు.  ఈ దారుణానికి కారణమైన కుక్క మాత్రం ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరింది.