కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌:  ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలియజేశారు.  విత్తనాలు, ఎరువులు అక్రమ నిల్వలపై దృష్టిసారించాలని డీజీపీకి సూచించినట్లు ఆయన అన్నారు. పాత స్టాక్‌ ఎరువుల్ని కొత్త ధరకు అమ్మితే లైసెన్సులు రద్దుచేస్తామని మంత్రి తెలియజేశారు.