కృష్ణా తీరాన భక్తుల పుణ్యస్నానాలు

విజయవాడ : కార్తీక పౌర్ణమి పర్వదినాన కృష్ణా తీరానికి భక్తులు పోటెత్తారు.ఈ తెల్లవారుజాము నుంచే విజయవాడ దుర్గాఘాట్‌లో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నదిలో నీటి మట్టం లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేసిన జల్లు స్నానాల ఘట్టాల వద్దే భక్తులు ఎక్కువగా స్నానం చేశారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి పరమేశ్వరుడిని భక్తిశ్రద్దలతో కొలిచారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన ప్రసిద్దగాంచిన పాత శివాలయంతోపాటు అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఆదిదంపతులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.