కేంద్రం ఇవ్వాల్సిన నిధుల కోసం వెల్లని కేసీఆర్…
రాష్ట్రంలో సంచార, కులవృత్తులకు జాతులకు తీరని అన్యాయం..
జాతీయ కమిటీ సభ్యులు నరసింహ…
శంకరా పట్నం: జనం సాక్షి సెప్టెంబర్ 3
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం నుండి సంచార జాతులకు, కులవృత్తుల కుటుంబాలకు రావాల్సిన నిధుల కోసం వెళ్లి అడగకుండా నియంతగా వ్యవహరిస్తున్నాడని, జాతీయ సంచార జాతుల అభివృద్ధి కమిటీ, కేంద్ర మంత్రి హోదా కలిగిన, జాతీయ సభ్యుడు తుర్క నరసింహ ఆరోపించారు. శనివారం శంకరపట్నం తాసిల్దార్ కార్యాలయాన్ని, నరసింహ సందర్శించారు. జాతీయ కమిటీ సభ్యునికి తహసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానం చేశారు. అనంతరం నరసింహ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుల వృత్తుల అభివృద్ధి కోసం కేంద్రం నుండి రావలసిన నిధులను ముఖ్యమంత్రిగా అడగకపోవడమే కాకుండా, రాష్ట్ర ముఖ్య అధికారులను నిధుల కోసం పంపకుండా నియంతగా వ్యవహరించి, తెలంగాణ రాష్ట్రంలోని ఓ బి సి కార్పొరేషన్ లో నిధులు లేకుండ చేశారని దీంతో, సంచార జాతులకు, కుల వృత్తుల పైన జీవనోపాధి పొందుతున్న కుమ్మరి, కమ్మరి ,చాకలి, మంగలి, వడ్డెర, ఎస్సీ, ఎస్టీ ఇతర కులాలకు ఆర్థిక అభివృద్ధి లేకుండ కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ కులాలకు చెందిన యువతకు విద్యలో కూడా తీరని అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల తీరు మార్చుకొని నిధుల కోసం రాష్ట్రము నుండి కేంద్రానికి చెల్లించాల్సిన 20% చెల్లించి, కేంద్రం నుండి నిధులు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, పేద కుటుంబాల యువకులకు విద్యార్థులకు ఉన్నత చదువులతో పాటు, పేద కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్రము నుండి వేల కోట్ల రూపాయలను తీసుకువచ్చి పేదలకు ఉన్నత చదువులతో పాటు, పేద కుటుంబాల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, తహసిల్దార్ గూడూరు శ్రీనివాసరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నతానియల్, తదితరులు పాల్గొన్నారు.