కేంద్రం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

 

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ):
గ్రానైట్ పరిశ్రమల రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా లో గ్రానైట్ పరిశ్రమలకు చిన్న మద్యతరహా పరిశ్రమల కేంద్రం నుంచి ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ (ఎంస్ఎంఈ) అదనపు డెవలప్ కమిషనర్ డి.చంద్రశేఖర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ జిల్లా గ్రానైన్ పరిశ్రమల ఆద్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన చిన్న మద్యతరహా పరిశ్రమల కేంద్రం (ఎంఎస్ఎంఈ) అదనపు డెవలప్ కమిషనర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ పరిశ్రమల నిర్వాహకులు గత 15 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రానైట్ పరిశ్రమల ప్రస్థానాన్ని కొనియాడారు. పారిశ్రామిక సబ్సిడి పథకాలను సద్వినియోగం చేసుకుని అభివ్రుద్దిలో ముందుకు సాగాలని సూచించారు. జిల్లాలో రుణాల కోసం గ్రానైట్ పరిశ్రమల నుంచి స్వీకరించిన ధరఖాస్తులను పరిశీలించి 100 యూనిట్ల పరిశ్రమలకు రుణాలివ్వడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 300 యూనిట్ల గ్రానైట్ పరిశ్రమలకు గాను ప్రస్తుతం 100 యూనిట్లకు రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఒక్కో యూనిట్కు 3 కోట్ల చొప్పున 100 యూనిట్లకు గాను 300 కోట్ల రూపాయాల రుణాలను అందజేసామని తెలిపారు. మిగిలిన 200 యూనిట్లకు సంబంధించిన పరిశ్రమలకు అతిత్వరలోనే రుణాలను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎంఎస్ఎంఈ కి సంబంధించి వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని పథకాలు, సబ్సిడీ రుణాలపై అవగాహన కల్పించారు. కరీంనగర్ గ్రానైట్ ఇండస్ట్రీస్ క్లస్టర్ కు తోడ్పడతామని పేర్కొన్నారు. 2 కోట్ల వరకు కారన్ కలెట్రల్ రుసుము రుణాలు, పారిశ్రామిక సబ్సిడీ పథకాలు, ఎగ్జిబిషన్ ఇసుక, అంతర్జాతీయ ప్రతినిధుల పథకాలపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రానైట్ అధ్యక్షుడు పి.శంకర్ అద్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, ఎంఎస్ఎంఈ హైదరాబాద్ నుంచి ప్రతినిధుల బ్రుందం పాల్గొన్నారు. జిల్లా పరిశ్రమల జిఎం బి.నవీన్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, క్లస్టర్ కన్సల్టెంట్ పటేల్, అసోసియేషన్ జిల్లా అద్యక్షుడు పి.శంకర్, జనరల్ సెక్రటరీ ప్రదీప్, కోశాధికారి జె.అశోక్, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, పి.జగన్ కుమార్ రావు తదితర 200 మంది సభ్యులు పాల్గొన్నారు.