కేంద్రప్రభుత్వ ప్రకటనలన్నీ మోసపూరితం-కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు సంబందించి కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్ని మోసపూరితంగా ఉంటున్నాయని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. కేంద్రంపై రాజకీయ ఒత్తిడిలేనిదే తెలంగాణ సాద్యం కాదని చెప్పారు. తెలంగాణపై కేంద్రమంత్రి వయలార్‌ రవికి చిత్తశుద్ది ఉంటే తెలంగాణపై నిర్ణయం ఎప్పుడో ప్రకటించేవారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను చంద్రబాబు, షర్మిలలు విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు.