కేకే ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ అనుమతిపై చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మాజీ రాజ్యసభ సభ్యుడుకే. కేశవరావు నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వం నుండి హైదరాబాద్‌ మార్చ్‌కు అనుమతి ఇప్పించేందుకు సీఎంపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకోవల్సిన నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మార్చ్‌కు అనుమతి ఇచ్చేది లేదని ఇన్‌ఛార్జి డీజీపీ దినేష్‌ ప్రకటన పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు బావిస్తున్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు కదలుతున్న తెలంగాణ మార్చ్‌కు  అనుమతి ఇప్పించకపోతే ప్రజల్లో తిరగలేమని మంత్రులు గ్రహించినట్లు సమాచారం, తెలంగాణ జేఏసీ నేతలతో మాట్లాడి వేదిక మార్చుకుంటే అనుమతి గురించి ఆలోచిస్తామని సీఎం మంత్రులకు సూచించడంతో వారు కేకే తో సమావేశామయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ, మంత్రులు జానారెడ్డి. సారయ్య. తెలంగాణ ఎంపీలు మందా జరన్నాధం, వివేక్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.