కేటీపీఎస్‌లో ప్రమాదం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం కేటీపీఎస్‌ పాతకర్మాగారంలోని  ‘ఎ’ స్టేషన్లో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులపై బొగ్గు పెళ్లలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.