కేటీపీఎస్ పదో యూనిట్లో వార్షిక మరమ్మతులు
ఖమ్మం: కేటీపీఎస్ పదో యూనిట్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యుత్ డిమాండ్ తో ఈ ఏడాది జూన్లో జరగాల్సిన వార్షిక మరమ్మతుపనులు వాయిదా వేయడమే దీనికి కారణంగా అధికారులు తెలియజేశారు. దీంతో పదో యూనిట్లో 15 రోజులపాటు విద్యుదుత్పత్తి నిలిపివేసి వార్షిక మరమ్మతు పనులు చేపట్టారు.