కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన :కె. కేశవరావు

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన వ్యవహారంలో కేబినెట్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌నేత కె. కేశవరావు తప్పుబట్టారు. దీనికి సంబంధించి కేబినెట్‌ మీటింగ్‌ జరిగిన మరుసటి రోజే గవర్నర్‌కు కేకే లేఖ రాశారు. ఇది ఆలస్యంగా మీడియా దృష్టికి వచ్చింది. ధర్మాన వ్యవహారంలో రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకోవాలని కేకే గవర్నర్‌ కోరినట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే చాలా విషయాల్లో అబాను పాలయిందని, ఇపుడు ధర్మాన విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కేకే తన లేఖలో కోరినట్లు తెలుస్తొంది.