కే.యు ఎండిఎ కోర్సులో చేరిక

ఖమ్మం, అక్టోబర్‌ 16 : పట్టణంలోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ పిజి కళాశాలలో విద్యార్థులకు ఎంబిఎ కోర్సులో సిట్లు అందుబాటులో ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్‌ వరలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం ఐసెట్‌ రాసిన విద్యార్థులకు జరుగుతున్న వెబ్‌ కౌన్సెలింగ్‌లో కళాశాలలో చేరేందుకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చేందుకు కళాశాల కోడ్‌ కే.యు.కే.హెచ్‌.ఎస్‌.ఎఫ్‌ను ఉపయోగించాలని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం పిజి కళాశాలలో వెబ్‌ ప్రాధాన్యతను ఉచితంగా అవకాశం కల్పించినట్టు ఆమె తెలిపారు. ఇతర వివరాలకు 9912263863, 944062571 నంబర్లలో సంప్రదించాలని కోరారు.