కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు మంజూరు

కరీంనగర్‌, నవంబర్‌ 6 : జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయలో అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆలయ ఇఓ రఘుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ గత ఐదారు సంవత్సరాల నుండి నిధులు లేక ఆలయంలోని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో  పనులను ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఆలయంలో నూతనంగా కోనేరు నిర్మాణం, కల్యాణమండపం, రహదార్ల నిర్మాణానికి నిధులను ఉపయోగిస్తామని అన్నారు. ప్రభుత్వ నిధులు సమకూర్చడంతో త్వరలోనే పనులు ప్రారంభించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఫౌండర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఆంజనేయులు, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.