కొండా మురళి అనర్హత వేటును స్వీకరించాలి

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజనం కాదని ఆ పార్టీ సీనియర్‌ నేత తులసిరెడ్డి అన్నారు. కొండా మురళి అనర్హత వేటును స్వీకరించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు కొండా పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. బీసీలకు చంద్రబాబు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థులు దొరికితే బీసీలకు 200 సీట్లు ఇస్తామని ఆయన తెలియజేశారు.