కొద్దిగా తగ్గిన పసిడి ధర!

హైదరాబాద్‌, జూన్‌ 8 :  బంగారం ధర శుక్రవారంనాడు స్వల్పంగా తగ్గింది. నిన్నటి వరకు 30వేలరూపాయలకు పైనే పసిడి ధర పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారంనాడు వివిధ మార్కెట్లలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.29,720 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.27,240 కాగా కిలో వెండి ధర రూ.56,200 చేరుకుంది. విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.29,500, 22 క్యారెట్ల బంగారం 27,430, కిలో వెండి రూ. 54,300 పలికింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.29,560, 22 క్యారెట్ల రూ.27,260, కిలో వెండి రూ.54,600 చేరింది. పొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.29,600, 22 క్యారెట్ల బంగారం 27,140, కిలో వెండి 54వేల రూపాయలు మేర పలికింది.